ఈ నూనెల వాడకంతో బీ.పీని కంట్రోలు చేయచ్చని తెలుసా

రక్తపోటు నియంత్రణలో మనం తీసుకునే ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఉప్పు ఎక్కువగా ఉండే ఉత్పత్తులు, మసాలాలు, కొవ్వు పదార్థాలకు మాత్రం దూరంగా ఉండాలి. అదే సమయంలో రక్తపోటుని నియంత్రించటానికి కొన్ని నూనెలు సమర్దవంతమైన పాత్రను పోషిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.  ఆ నూనెలు ఏమిటో చూద్దాం. నువ్వుల నూనె, ధాన్యం పొట్టు నుంచి తీసి నూనె కలిపి వాడితే అధిక రక్తపోటు నియంత్రణలో ఉన్నట్లు తేలింది. అధిక రక్తపోటు బాధితులకు పక్షవాతం, గుండెజబ్బు ముప్పు అధికంగా ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో భాగంగా సుమారు 40 గ్రాముల మేరకు నువ్వుల నూనె, తవుడునూనె కలిపి తీసుకుంటే రక్తపోటు తగ్గుముఖం పడుతుందని పరిశోధనా ఫలితానలు ప్రకటించారు.  ఈ తగ్గుదల ఎంతలా అంటే రక్తపోటును నియంత్రించడానికి తీసుకునే ఔషధాలతో సమానంగా ఉంటుందని అన్నారు.  ఔషధాలు, నూనెల మిశ్రమాన్ని వాడినవారిలో రక్తపోటు రెండు రెట్లు తగ్గడం విశేషం.

ఇక వీటితో పాటు  సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటేనే తగిన ఫలితం ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పుని తక్కువగా ఉపయోగించాలి. దీంతోపాటు కాలానికి అనుగుణంగా అన్ని రకాల పండ్లను ఎక్కువగా తినాలి. బీపీ రోగులు ఎప్పుడూ ఒకే వేళలో భోజనం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు వారు సమతుల ఆహారం కూడా తీసుకోవాలి. పండ్లు, పండ్ల రసాలను కనీసం రోజుకు 3 సార్లు తీసుకుంటే ఫలితం ఉంటుంది. మాంసాహారం, మద్యపానం, ధూమపానం వంటివి చేయకూడదు. దీంతో రక్తపోటు మరింతగా పెరుగుతుంది.